Header Ads

ఓ వంశానికి చెందిన ఆచారం విన్న వారెవరికైనా కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం.. కొత్తగా పెళ్లి చేసుకున్న ఏ జంట అయినా సరే తమ మొదటి శృంగారాన్ని


భార్యా భర్తల శృంగారం అంటే మూడో కంటికి తెలియకుండా నాలుగ్గోడల మధ్య జరుగుతుంది. ఇండియా లాంటి సాంప్రదాయక దేశాల్లో 'సెక్స్' అనే పదాన్ని నలుగురి ముందు పలకడానికి కూడా సంకోచించే పరిస్థితి ఉంది. అలాంటిది ఏకంగా కుటుంబంలోని వారంతా కళ్ళప్పగించి చూస్తుండగానే కొత్త పెళ్ళికూతురు - పెళ్ళికొడుకు తమ తమ ఒంటి మీది బట్టల్ని పూర్తిగా విప్పేసి సెక్స్ లో పాల్గొనడమంటే బరితెగింపు, దిగజారుడు తనానికి నిదర్శనంగానే భావించాల్సి ఉంటుంది. కానీ సింగపూర్ లోని ఉడ్-ల్యాండ్ న్యూటౌన్ లో ఉండే ఓ వంశానికి చెందిన ఆచారం విన్న వారెవరికైనా కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. ఆ వంశానికి ఇదో ఆచారం! తరాలుగా కొనసాగిస్తూ వస్తోన్న సాంప్రదాయం.

సింగపూర్ లోని ఉడ్-ల్యాండ్ టౌన్లో నివసించే ఆ కుటుంబ ఆచార సాంప్రదాయాల ప్రకారం కుటుంబంలో కొత్తగా పెళ్లి చేసుకున్న ఏ జంట అయినా సరే తమ మొదటి శృంగారాన్ని కుటుంబ సభ్యులందరి ముందు సాగించాల్సిందే. ఈ తతంగాన్నంతా ఆ కుటుంబం సభ్యులు వీడియో కూడా తీసుకోవచ్చట. మరింతగా విస్మయానికి, జుగుప్స కలిగించే విషయం ఏమిటంటే.. కొత్తగా పెళ్ళయిన జంట సెక్స్ లో పాల్గొంటుంటే పెళ్లి కుమారుడి తల్లి పక్కనే ఉండి శృంగారానికి సంబంధించిన మెలకువల గురించడం సలహా సూచనలు ఇవ్వడం.

ఈ ఆచారం సంగతి ఏ విధంగా బయటకు పొక్కిందో గానీ.. ఆ కుటుంబంలో జరిగిన ఇలాంటి తతంగమంతా ఇంటర్నెట్ లోకి ఎక్కేసింది. క్షణాల్లో అది వైరల్ గా మారిపోయి ప్రపంచమంతా ఈ వార్త పాకిపోయింది.

అయితే.. దీనిపై వివరణ ఇచ్చిన ఆ కుటుంబ సభ్యుల వాదన మాత్రం మరోలా ఉంది. తొలిసారి కొత్త జంట మధ్య శృంగార ఘట్టానికి సాక్షులుగా ఉండడం, ఆ మధుర క్షణాలను దగ్గరుండి చూడడం తమకు గర్వకారణంగా ఉంటుందని చెబుతున్నారు ఆ కుటుంబ సభ్యులు.